ఉద్యోగాలివ్వు బతుకమ్మ.. నోటిఫికేషన్లు ఇవ్వాలని బతుకమ్మను వేడుకున్న నిరుద్యోగులు
తెలంగాణలో బతుకమ్మ సంబురాలను ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపేందుకు, తమ హక్కులను సాధించుకునేందుకు వేదికగా మార్చుకుంటున్నారు నిరుద్యోగులు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాలను ఎండగడుతూ దిల్సుఖ్నగర్ వేదికగా నిరుద్యోగ యువతులు బతుకమ్మ సంబురాల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
- నిరసన ప్లకార్డులతో బతుకమ్మ ఆడిన యువతులు
- పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 15 : తెలంగాణలో బతుకమ్మ సంబురాలను ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపేందుకు, తమ హక్కులను సాధించుకునేందుకు వేదికగా మార్చుకుంటున్నారు నిరుద్యోగులు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాలను ఎండగడుతూ దిల్సుఖ్నగర్ వేదికగా నిరుద్యోగ యువతులు బతుకమ్మ సంబురాల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరుద్యోగ బతుకమ్మ పేరుతో ఉన్న బ్యానర్‌తో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి తమ చైతన్యపురిలో నిరుద్యోగ యువతులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురిలో ప్లకార్డుల్లో “తంగేడుపూల బతుకమ్మ ఉయ్యాలో…. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో… నిరుద్యోగుల బతుకులు మారాలే ఉయ్యాలో…, నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్ ఉయ్యాలో…. నిరుద్యోగభృతి ఎక్కడ ఉయ్యాలో….జాబ్ క్యాలెండర్ అంటివీ ఉయ్యాలో…..జాబ్ క్యాలెండర్ ఎక్కడా ఉయ్యాలో….” అంటూ పాటలు పాడుతూ కోలాటం, దాండియా ఆడుతూ నిరసన తెలిపారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు సంధ్య, శ్రావణి, మమత, గీత, సునీత, హేమ, కవిత, పెద్ద సంఖ్యలో యువతులు పాల్గొన్నారు.
2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమయ్యాయి : ఎమ్మెల్యే
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అందరూ ఆనందంగా జరుపుకుంటుంటే నిరుద్యోగ యువత మాత్రం బతుకమ్మలను బాధతో జరుపుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమయ్యాయో చెప్పాలి. బతుకమ్మ నిరుద్యోగులను అనుగ్రహిస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో నోటిఫికేషన్లు వస్తాయి. ప్రభుత్వం ఇకనైనా మోసపు మాటలు ఆపి నోటిఫికేషన్లు ఇవ్వాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

