వెంగళరావునగర్, మార్చి 2: తెలంగాణ ఆయుర్వేదిక్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్. ఉమా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానాలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షురాళ్లుగా డాక్టర్ సుజాత, డాక్టర్ దుర్గాబాయి, కార్యదర్శిగా డాక్టర్ వి.నరసింహ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఎం. లక్ష్మి, కోశాధికారిగా డాక్టర్ నాగలక్ష్మి, సభ్యులుగా డాక్టర్ ఎం. జోహార్, డాక్టర్ ఐ. అశోక్, డా. కే.అరుణాగాయత్రి, డాక్టర్ సంధ్యా సందీప, డాక్టర్ సుజాత ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయుర్వేదిక్ రాష్ట్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో అసోసియేషన్ ను ముందుకు నడుపుతామని పేర్కొన్నారు.