చాంద్రాయణగుట్ట, జూన్ 23 : బాలికను బెదిరించిన ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడగా, బాలిక గర్భందాల్చిన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక (17), జన్మదిన వేడుకల సందర్భంగా వరుసకు సోదరుడైన అలీ (32) సెల్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత సెల్‌ఫోన్‌కు సంబంధించి ఈఎంఐ ప్రాసెస్ ఉన్నదని, తన వెంట బ్యాంకుకు రావాలని నమ్మబలికాడు.
మలక్‌పేట్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న యువకుడి స్నేహితుడు అర్బస్ (27) బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం తెలిపింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.