Hyderabad | హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద ఓ కారు అడ్వర్టైజింగ్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
శంకర్పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే.. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్‌స్పీడ్‌గా కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.