సిటీబ్యూరో/ బడంగ్‌పేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బినామీ కాంట్రాక్ట్ అవతారం ఎత్తారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏ టెండర్ ఐనా చక్రం తిప్పుతూ ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ శాఖలో జీతం తీసుకుంటూనే కాంట్రాక్ట్ పనులు దక్కించుకోవడం, టెండర్ వేసే వేరే కాంట్రాక్టర్లను భయబ్రాంతులకు వెనుకాడడం లేదన్న అరోపణలు లేకపోలేదు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న భాస్కర్, అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌తో కలిసి గాయత్రీ ఎంటర్ప్రైజెస్ అనే బినామీ సంస్థ పేరుతో పనులు చేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కొంత మంది కమిషనర్ వాణిదేవిని కలిసి భాస్కర్ , సుధాకర్‌పై ఫిర్యాదులు చేశారు.
ఇద్దరు కలిసి బినామీ పేర్ల మీద వర్కులు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో కమిషనర్ పిలిచి మందలించిన్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అయినా వారిలో మార్పు రాక పోవడంతో ఉన్న పురపాలక శాఖ సెక్రటరీ ఇలంబర్తికి ఫిర్యాదు చేసేందుకు కొందరు కాంట్రాక్టర్లు సిద్దమయినట్లు తెలిసింది.
ఆరోపణలు ఉన్నా..చర్యలు శూన్యం
ఇంజినీర్ సూచనల మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులు (రోడ్లు, డ్రైనేజీ)భవనాలు, నీట సరఫరా మొదలైనవి వర్క్ ఇన్ స్పెక్టర్ పర్యావేక్షణ చేయాలి. కాంట్రాక్టర్లు. మేస్త్రీలు, కార్మికులు చేస్తున్న పనులను సమయానుసారం పర్యవేక్షించాలి. చేసిన పనులకు కొలతలు, రికార్డులు, తీసుకోవాలి. మెజర్ మెంట్స్ బుక్స్, ఎంబీ బుక్స్ ను తీసుకొని ఎఈ, డీఈ సూచనల మేకు రికార్డులు చేయాలి. నిబంధనల ప్రకారం చేయవలసిన పనులు చేయకుండా వారే కాంట్రాక్టర్లగా అవతారం ఎత్తడం.
కాంట్రాక్టర్లను, అధికారులను సైతం ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కొంత మంది కమిషనర్ వాణిదేవి భాస్కర్ , సుధాకర్‌పై ఫిర్యాదులు చేశారు. ఇద్దరు కలిసి బినామీ పేర్ల మీద వర్క్‌లు చేస్తున్నాని వచ్చిన ఫిర్యాదులతో కమిషనర్ పిలిచి మందలించిన్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిపై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్న చర్యల విషయంలో కమిషనర్, ఉన్నతాధికారులు తాత్సారం చేస్తుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సీఎం శాఖలో అవినీతి పెచ్చుమీరుతుందని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
ఏండ్ల తరబడి ఒకే చోట తిష్ట
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గత ఏడు సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. చాలా కాలం నుంచి పనిచేయడంతో ఇక్కడ జరుగుతున్న లోటు పాట్లు తెలిసిపోవడంతో ఈ ఇద్దరి వ్యవహారం ఆడిదే ఆట పాడిందే పాటగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆప్రేటర్ పనిచేస్తున్న సుధాకర్ పేరుతో సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్‌లు తీసుకొని బినామీ పేర్ల మీద పనులు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో సమస్య జఠిలం అయింది.