హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి ఎల్ఎస్డీ అనే డ్రగ్స్‌తో పాటు రూ. 16 వేలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనేందుకు యత్నించిన సాయి కుమార్(బంజారాహిల్స్) వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను ఫిల్మ్‌నగర్‌కు చెందిన వై నవీన్(23), యూసుఫ్‌గూడ వాసి ఎస్ సాయి చరణ్(22)గా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ను గోవా నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.