సిటీబ్యూరో, సెప్టెంబరు 1 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో ఇప్పటి వరకు కొనసాగిన పాత విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) పోర్టల్ ద్వారానే ఇకపై క్యూర్ పరిధిలో మూడు కార్పొరేషన్లలో ప్రజలు సీఆర్ఎస్ పోర్టల్‌లోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని మూడు ముక్కలుగా విభజన కాకముందే గత ఫిబ్రవరి 11 వ తేదీకి ముందు జీహెచ్ఎంసీలోని పలు సర్కిళ్లలో బోగస్ డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రయల్ రన్‌గా అంబర్‌పేట సర్కిల్లో మంగళవారం బర్త్, డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.