హైదరాబాద్ : ఓంసాయి ట్రావెల్స్‌పై(Omsai Travels) ప్రయాణికులు(Travelers) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు తాము ఎక్కిన బస్సులో కనీస వసతులు కల్పించకపోవడంతో డ్రైవర్‌ను ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అశోక్‌నగర్‌లో డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. చేసేది లేక ప్రయాణికులు రాత్రంతా రామచంద్రాపురం పీఎస్ (Ramachandrapuram) వద్ద పిల్లలతో పడిగాపులు కాశారు. అనంతరం రామచంద్రాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.