సిటీబ్యూరో, మే14 (నమస్తే తెలంగాణ): సమాజంలో ట్రాన్స్జెండర్లకు గౌరవమైన జీవన భృతి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, చంద్రకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్‌హాల్‌లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధులు, ఎన్జీఓలతో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సేవలను జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలలో వినియోగించే అంశంపై వారి సూచనలు, అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల ఆసక్తి, అర్హతల మేరకు జీహెచ్ఎంసీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చేపట్టే చర్యల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీలోనే కాకుండా ఇతర విధాల ఉపాధి పొందడానికి వారికి శిక్షణ కూడా ఇస్తారని చెప్పారు.
జీహెచ్ఎంసీలో పలు ఉద్యోగ అవకాశాలను ట్రాన్స్జెండర్లు వినియోగించుకొని ఆర్థికంగా నిలదొకుకోవాలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయమని, అందుకు తమతమ విద్యా అర్హతలు, నైపుణ్యత, ఆసక్తి మేరకు అనువైన రంగాన్ని ఎంచుకోవాలని, దానికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు యూసీడీ విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్‌రెడ్డి వివరించారు.
ఉద్యోగ అవకాశాలకు అర్హత లేని ట్రాన్స్ జెండర్లను స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే విధంగా కూడా జీహెచ్ఎంసీ కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మూడు ట్రాన్స్జెండర్ల ఎస్‌హెచ్‌జీ గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజీ లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరిన్ని ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వివిధ ఎన్జీఓల ద్వారా పలు రంగాల్లో శిక్షణ నిచ్చి స్వయం ఉపాధికి చేయుతనివ్వనున్నట్లు తెలిపారు.
సెక్యూరిటీ గార్డ్స్, క్లీన్ డ్రైవ్ అమలులో గ్రీన్ మార్షల్స్, పారులు, హెచ్ఎండబ్లూఎస్ అండ్ ఎస్బీ రిజర్వాయర్ల వద్ద, స్పోర్ట్స్ గ్రౌండ్స్ వద్ద సెక్యూరిటీ గార్డ్లుగా, మెట్రో స్టేషన్లో ఉద్యోగ అవకాశాలు, అమృత్ సీం కింద నీటి నాణ్యత పరీక్షలో సహకారం, శిక్షణ అనంతరం స్ట్రీట్ లైట్ల నిర్వహణ, బస్తీ దవాఖానాలలో ప్యారా మెడికల్‌గా ఉపాధి పొందే అవకాశం ఉందని, అర్హత గల వారందరిని భర్తీ చేస్తామన్నారు. స్పోర్ట్స్ విభాగంలో ఎలాంటి విద్యార్హత లేని అభ్యర్థుల నుంచి అత్యధిక విద్యార్హతలు ఉన్న వారి వరకు పలు రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఆయా వివరాలను స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ యాదగిరి రావు వివరించారు.
సమావేశానికి హాజరైన ట్రాన్స్‌జెండర్ ఎన్జీఓలు పలువురు ఈ సందర్భంగా సిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా అందిస్తున్న శిశ్షణలను వారికి వివరించారు. ఆయా శిక్షణ సంస్థలు ఇస్తున్న ట్రైనింగ్, మారెట్ లింకేజి తదితర విషయాలను వివరించారు. పలువురు ట్రాన్స్ జెండర్ల ప్రతినిధులు వారివారి అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు ఉద్యోగ ఉపాధితో జీవనోపాధికి సంబంధించిన వివిధ అంశాలపై గల సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, హార్టికల్చర్ ఆఫీసర్ డా.సునంద, అడ్మినిస్ట్రేషన్ జేసీ శ్రీనివాస్, ఎన్జీఓలు, వివిధ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.