సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖలోని ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్ల భర్తీ ప్రక్రియ షురువైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించేందుకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల ఎంపిక ప్రక్రియను బుధవారం గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో నగర పోలీసు కమిషనర్ సీవీ. ఆనంద్ ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లకు ఫిజికల్ ఈవెంట్ నిర్వహించగా, అందులో 44 మంది ఎంపికయ్యారు. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మీ కమ్యూనిటీకి ఒక రోల్ మాడల్ కావాలంటూ.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపికైన ట్రాన్స్జెండర్లకు సూచించారు. సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని వినియోగించుకొని, పోలీసు శాఖకు మంచి పేరు తేవాలన్నారు.