సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): జల మండలికి కొత్తగా కేటాయించిన 141 మంది జూనియర్ అసిస్టెంట్స్ (పీఅండ్ఏ, ఎఫ్అండ్ఏ)కు రెండు రోజుల శిక్షణ పూర్తయింది. గచ్చిబౌలిలోని ఎస్కీ క్యాంపస్‌లో రెండు రోజుల పాటు 141 మందిని మూడు బ్యాచులుగా చేసి శిక్షణ తరగతులు నిర్వహించారు.
సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత మూడో బ్యాచ్‌కు శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. రెండు బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి కావడంతో ఈడీ మయాంక్ మిట్టల్ వారికి ధ్రువపత్రాలు అందజేశారు.