ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
సద్దుల బతుకమ్మ సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- ట్రాఫిక్ జాయింట్ కమిషర్ జోయల్ డేవిస్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరయ్యేందుకు అమరవీరుల స్మారక స్తూపం నుంచి బతుకమ్మ ఘాట్ (రోటరీ చిల్డ్రన్స్ పార్క్)వరకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశమున్నందున ట్యాంక్‌బండ్‌కు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు బంద్చేయడం, దారి మళ్లించడం చేస్తామని ఆయన తెలిపారు.
ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ చుట్టూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, కర్బాలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలకు ఆ సమయంలో అనుమతి లేదని, ఇక్బాల్మినార్ నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద కట్టమైసమ్మ, డీబీఆర్, ఇందిరాపార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వైపు మళ్లిస్తామని తెలిపారు.
పీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వైపు ప్రసాద్ ఐమాక్స్, మింట్‌కాంపౌండ్ లైన్ మీదుగా మళ్లిస్తామని చెప్పారు. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదని, వాటిని నల్లగుట్ట క్రాస్‌రోడ్స్ నుంచి రాణిగంజ్, నెక్లస్రోడ్ మీదుగా మళ్లిస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. లిబర్టీ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్బాల్మినార్ యుటర్న్ వయా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు..
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు వచ్చే వాహనాలు.. కర్బలామైదాన్ నుంచి బైబిల్‌హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ, గాంధీనగర్ టీ జంక్షన్, గోశాల, ధోబీఘాట్, స్విమ్మింగ్‌పూల్, బండమైసమ్మ, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని సూచించారు. ముషీరాబాద్, కవాడిగూడ జంక్షన్ నుంచి చిల్డ్రన్‌పార్క్ వైపుగా ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి లేదని, డీబీఆర్ మిల్స్ నుంచి ఎమ్మార్వో ఆఫీసు, ధోబీఘాట్, స్విమ్మింగ్‌పూల్, బండమైసమ్మ, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ మీదుగా మళ్లిస్తామని జోయల్ డేవిస్ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వైపు వచ్చే డిస్ట్రిక్ట్ ఆర్టీసీ బస్సులను స్వీకార్ ఉప్కార్ జంక్షన్ మీదుగా మళ్లిస్తామని, సిటీబస్సులను కర్బాల మైదాన్ నుంచి బైబిల్‌హౌస్ మీదుగా పలు జంక్షన్ల ద్వారా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. సద్దులబతుకమ్మకు వచ్చేవారి కోసం స్నోవరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, అమరవీరులస్మారకం, రేస్‌కోర్స్ రోడ్, బీఆర్కె భవన్, హెచ్ఎండీఏ పార్కింగ్, సంజీవయ్య పార్క్ ప్లేస్, లుంబిని పార్క్ ఎదురుగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు జోయల్‌డేవిస్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

