బంజారాహిల్స్, నవంబర్ 25: జూబ్లీహిల్స్ రోడ్ నం. 45తో పాటు మరికొన్ని రోడ్లపై ఉన్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పోలీసులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపును నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 54లోని హార్ట్‌కప్ చౌరస్తా, వరమహాలక్ష్మి చౌరస్తా, రోడ్ నం. 36లోని క్రోమా చౌరస్తాలో ట్రాఫిక్ సాగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.
ట్రాఫిక్ మళ్లింపుతో ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి.. ప్రజల నుంచి వస్తున్న స్పందనపై పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్‌తో చర్చించారు. ట్రాఫిక్ మళ్లింపుతో అంతర్గత రోడ్లపై కూడా దృష్టిసారించాలని, ఈ విధానం అలవాటు అయ్యేంత వరకు వాహనదారులకు నచ్చజెప్పాలని సూచించారు.