హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రేపట్నుంచి జూన్ 4వ తేదీ వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా నాలా వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా ఆంక్షలు విధించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ మీదుగా మళ్లించనున్నారు. ఈ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు.