Jiyaguda | జియాగూడ, మే 28 : హైదరాబాద్ జియాగూడ 100 ఫీట్ల రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు గుంతలను పూడ్చారు. 100 ఫీట్ల రోడ్డులోని ఒకపక్క మొత్తం గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనిపై ప్రయాణికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బుధవారం నాడు గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. 100 ఫీట్ల రోడ్డులోని గుంతలను ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది మట్టితో పూడ్చారు. దీంతో రోడ్డులో రెండువైపులా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు.