జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రోడ్డుపై సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం హల్చల్ చేశాడు. కారులో డ్రైవ్ చే సుకుంటూ రాంగ్ రూట్లో వస్తుండగా గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆయనను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు కానిస్టేబుల్కు, బెల్లంకొండకు మధ్య వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్రూట్లో బెల్లంకొండను అనుమతించనని చెప్పడంతో శ్రీనివాస్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
– సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ)