సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : సినీ హీరో నవీన్‌రెడ్డి అట్లూరి అరెస్టయ్యారు. ఎన్ స్కేర్ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగిన ఆయన సహ డైరెక్టర్లకు తెలియకుండా ఆస్తులు తాకట్టు పెట్టినట్లు ఫిర్యాదు రావడంతో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్‌రెడ్డిపై ఎన్ స్కేర్ డైరెక్టర్లు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు సినీహీరో అట్లూరి నవీన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి విచారించిన సీసీఎస్ పోలీసులు శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే మోసం చేసిన డబ్బులతో నవీన్‌రెడ్డి జల్సాలు, ‘నో బడీ’ అనే పేరుతో హీరోగా సినిమాలో నటించారని తెలిసింది. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెంకు చెందిన నవీన్‌రెడ్డిపై గతంలో బైక్ దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.