Venu Udugula | న్యూయార్క్లో ఉన్న అనుభూతి కలుగుతోంది.. హైదరాబాద్ అభివృద్ధిపై టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ప్రశంసలు
Venu Udugula | పదేండ్లుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అంటున్నారు యువ దర్శకుడు వేణు ఊడుగుల. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వేణు ఊడుగుల ‘నమస్తే తెలంగాణ’తో తెలంగాణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Venu Udugula | పదేండ్లుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అంటున్నారు యువ దర్శకుడు వేణు ఊడుగుల. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వేణు ఊడుగుల ‘నమస్తే తెలంగాణ’తో తెలంగాణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ పదేండ్ల కాలంలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధిని చూస్తున్నారు ?
కేసీఆర్ సారథ్యంలో ఈ పదేండ్లలో తెలంగాణ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అన్ని రంగాల్లో ప్రగతి కనిపిస్తున్నది. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి కేసీఆర్ రైతుబాంధవుడిగా నిలిచారు. ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేస్తే దేశ ముఖచిత్రమే మారిపోతుంది. ఇప్పుడు రైతుబంధును దశలవారీగా 16 వేలకు పెంచాలని నిర్ణయించడం గొప్ప విషయం.
హైదరాబాద్ నగరంలో మీరు గమనించిన మార్పులేంటి?
ఈ పదేండ్లలో బెంగళూరు, చెన్నై వంటి నగరాలను అధిగమించి హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దుర్గంచెరువు తీగల వంతెన వద్దకు వెళ్లి చూస్తే న్యూయార్క్లో ఉన్నామనే అనుభూతి కలుగుతున్నది. కొత్తగా కట్టిన ఫ్లైఓవర్స్ వల్ల ట్రాఫిక్ స్మూత్గా సాగిపోతున్నది. ఇక శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీలేని వైఖరిని అవలంబిస్తున్నది. ఈ పదేండ్లలో చిన్న అలజడి కూడా లేకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఎక్కువ క్రెడిట్ కేటీఆర్కు ఇవ్వాలి. నగరానికి పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
గ్రామాల్లో జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి ?
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో కరువు తీర్చింది. ఒకప్పుడు నీళ్లు లేక నెర్రెలు చాచిన నేలలు ఇప్పుడు పచ్చదనాన్ని సింగారించుకున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా కనుచూపు మేర పచ్చదనమే కనిపిస్తున్నది. వ్యవసాయ భూములు కోట్లు పలుకుతున్నాయి. ఒకనాడు ఒక పంటకే నోచుకోని తెలంగాణ రైతులు నేడు రెండు మూడు పంటలు పండించే దిశకు చేరుకున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. మహిళలు నీళ్ల కోసం బిందెలు పట్టుకొని నడిచిన దృశ్యాలు గత కాలపు గుర్తులుగా మిగిలిపోయాయి.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో మీకు బాగా నచ్చినదేమిటి?
రైతుబంధు తర్వాత గర్భిణులకు న్యూట్రిషియన్ కిట్ అందించడం చాలా గొప్ప నిర్ణయం అనుకుంటున్నా. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేవే. మానవీయ కోణంలో చేసే అభివృద్ధి ఎప్పుడైనా సత్ఫలితాలను అందిస్తుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

