సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీం ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్‌హౌజ్‌లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి నెలకొందని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉండడంతో పలు ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు 2,3,4,5,7,9 , 10, 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం(నేడు) తాగునీటి సరఫరాలో కొన్ని చోట్ల పూర్తి అంతరాయం, మరికొన్ని చోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
మిరాలం, ఎన్పీఏ, బాలాపూర్, మైసారం, బార్కాస్, భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూం, రైల్వేస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతంనగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురీ కాలనీ, మహేంద్ర హిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్ప గడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్పేట్, బడంగ్‌పేట, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనున్నదని, వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.