మాదన్నపేట్ : పోచమ్మ ఆలయంలో అమ్మవారి నగలు చోరీకి గురైన సంఘటన కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చంపాపేట పోచమ్మ గడ్డలోని పోచమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి నగలు,సామాగ్రి దొంగలించారని తెలిపారు.
1తులం బంగారం , 5తులాల వెండి నగలతో పాటు ఇతర సామాగ్రిని దొంగలించారన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.