టోల్ గేట్లు జామ్..
ఇక బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి జనవరి 13వ తేదీన మొత్తం వాహనాలు 25,231 ప్రయాణించాయి. వాటిలో కార్లు 17,844, బస్సులు 872 టోల్ ప్లాజా నుంచి గ్రామాలవైపు ప్రయాణించాయి.
- టోల్ ప్లాజాలతో పాటు ఎల్బీనగర్లో సంక్రాంతి రద్దీ
- రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్
సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగర ప్రజలు ఊరెళ్లడంతో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు బస్ స్టాండ్ ప్రాంతంతో పాటు టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. పండుగకు పెద్ద ఎత్తున ప్రజలు వివిధ మార్గాల ద్వారా తమ సొంతూర్లకు తరలివెళ్లారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పంతంగి, బీబీనగర్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉందని, ఎల్బీనగర్లోని విజయవాడ వెళ్లే బస్‌స్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించిందని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
పంతంగి టోల్ ప్లాజా నుంచి..
హైదరాబాద్ – విజయవాడ రహదారిలో పంతంగి టోల్ ప్లాజా వద్ద జనవరి 12వ తేదీన మొత్తం 56,595 వాహనాలు వెళ్లాయి. వాటిలో కార్లు 42,844, ఆర్టీసీ బస్సులు, 1300, ప్రైవేటు బస్సులు 4,913, గూడ్స్ ఇతర వాహనాలు కలిపి 7,538 వాహనాలు ప్రయాణించాయి. ఇక 13వ తేదీన మొత్తం వాహనాలు 67,577 వాహనాలు వెళ్లగా, వాటిలో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1851, ప్రైవేటు బస్సులు 4,906, గూడ్స్, ఇతర వాహనాలు 7,259 ప్రయాణించాయి.
బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి వెళ్లిన వాహనాలు
ఇక బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి జనవరి 13వ తేదీన మొత్తం వాహనాలు 25,231 ప్రయాణించాయి. వాటిలో కార్లు 17,844, బస్సులు 872 టోల్ ప్లాజా నుంచి గ్రామాలవైపు ప్రయాణించాయి.
ఎల్బీనగర్ బస్టాండ్‌లో….
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్బీనగర్లో విజయవాడకు బస్సులు వెళ్లే బస్ స్టాండ్ ప్రాంతం రెండు రోజులుగా కిక్కిరిసి కనిపించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బృందాలు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణ చేశారు. మొత్తంగా సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

