గౌతంనగర్, జనవరి 13 : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మచ్చబొల్లారం డివిజన్లోని కుటియా టెంపుల్ వద్ద రూ.4కోట్ల నిధులతో బాక్స్ డ్రైన్, రిటర్నింగ్‌వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ జితేంద్రనాథ్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ 8వ వార్డు మెంబర్ లోకనాథం, డిప్యూటీ కమిషనర్ నాగమణి, ఈఈ రాజు, ఏ సీపీ విజయశ్రీ, డీఈ మహేశ్, ఏఈలు రవళి, స్వాతి, అ నిల్ ఎస్ఎస్ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు బొబ్బిలి సురేందర్‌రెడ్డి, జయప్రకాశ్, శ్రావణ్ముదిరాజ్, శ్రీశైలంయాదవ్, కొండల్‌రెడ్డి, సూర్యకిరణ్, నాగేశ్వరరావు, బలవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పరమేశ్, శోభన్‌బాబు, మల్లికార్జున్, దేవేందర్, సరిత, కవిత, సులోచన పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి..
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మౌలాలి డివిజన్ పరిధి భరత్‌నగర్‌లో చేపట్టిన ఆర్సీసీ పైపులైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. వరద ముంపు ప్రాంతాలలో బాక్స్డ్రైన్, ఆర్సీసీ డ్రైన్లను నిర్మించి ఇండ్లలోకి వరద నీరుపోకుండా చేస్తున్నామని తెలిపారు. భరత్‌నగర్‌లో ఆర్సీసీ పైపులైన్ పనులు పూర్తి అయిన వెంటనే ప్రధాన మార్గంలో, అంతర్గతంగా ఉన్న 18గల్లీలలో సీసీ రోడ్లు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, డీఈ మహేశ్, ఏఈ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పిట్ల శ్రీనివాస్, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, అమీనొద్దీన్, ఎం.భాగ్యనందరావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సత్తయ్య, భరత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంద భాస్కర్, ఆదినారాయణ, చందు, నాగరాజు, రాజు, సంతోష్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చొరవతోనే డ్రైనేజీ ఔట్లెట్ సమస్య పరిష్కారం..
మౌలాలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీలో 30 సంవత్సరాల నుంచి నెలకొన్న ఔట్లెట్ డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిష్కరించా రు. శుక్రవారం ఎమ్మెల్యే కాలనీ వాసులను కలిశారు. డ్రైనేజీ ఔట్లెట్ స్థలం కోర్టులో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు డ్రైనేజీ పనులను ఆపివేశారు. భూ యజమాని పాండుతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి డ్రైనేజీకి స్థలం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే మాటకు కట్టుబడి ఉంటామని స్థలంలో డ్రైనేజీ పైపులైన్ ఔట్‌లెట్‌కు ఒప్పుకున్నారు. డ్రైనేజీ ఔట్లెట్ సమస్య పరిష్కరించిన ఎమ్మెలేకు కాలనీవాసులు అభినందనలు తెలిపారు. డీఈ మహేశ్, ఏఈ శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఎం. భాగ్యానందరావు, సత్తయ్య, మంద భాస్కర్, చందు, జానీ సాగర్, రాజు, సంతోష్‌గౌడ్, నవాబ్, ఇబ్రహీం, షకీల్, గౌలికార్ శైలేందర్, గౌలికార్ దినేశ్, కాలనీ అడ్వజర్ బుచ్చిరెడ్డి, కాలనీ వాసులు ఉన్నారు.