
మేడ్చల్, డిసెంబర్ 20 : కేంద్రం రైతుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టడం సరికాదని, రైతుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చావుడప్పు, శవయాత్ర ఊరేగింపు చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్రమే కొనుగోలు చేయాలి : మంత్రి
ఘట్కేసర్ రూరల్ : తెలంగాణ రైతులు పండించిన వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం…
జవహర్‌నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకపోవడం దుర్మార్గమని మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట, మూడుచింతలపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కో ఆర్డినేటర్ నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయి బాబు, జడ్పీటీసీ అనిత లాలయ్య, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.
కీసరలో…
మేడ్చల్ కలెక్టరేట్ : కీసర మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు , ప్రజాప్రతినిధులు దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నేత చామకూర భద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ధాన్యం కొనాల్సిందే : రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ రూరల్ : తెలంగాణలో పండించిన ప్రతి వరి గింజను కేంద్రం కొనాల్సిందేనని టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్ మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ధాన్యం కొనడంలో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్లు లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, దీపికా రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రణదీప్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, నాయకులు ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.