సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతపై గ్రాండ్ దక్కన్ రైడ్ జరిగింది. ఇటాలియన్ ఫియాజియో గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం 400 మంది రైడర్లతో నిర్వహించిన ఈ రైడ్ సికింద్రాబాద్ ఫియాజియో షోరూం నుంచి సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ వరకు సుమారు 200 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా నగరవాసులకు రైడ్ నిర్వాహకులు హెల్మెట్స్ అందించారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం పనికి రాదని ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐ-గెట్ ఇంజిన్ కలిగిన అత్యంత వేగవంతమైన స్కూటర్ ఏప్రిలియా ఎస్ఆర్ 160ని ప్రదర్శించారు. అద్భుతమైన లుక్తో అదరగొట్టిన ఈ స్కూటర్ కేవలం 7.5 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ బిజినెస్ హెడ్ 2 వీలర్ బిజు సుకుమారన్, రీజనల్ బిజినెస్ మేనేజర్ క్రాంతి కుమార్, డీలర్ పార్టనర్స్, ఫైన్ ఎన్జీవో ఫౌండర్ సీహెచ్ పరమేశ్వరి పాల్గొన్నారు.