సిటీబ్యూరో: కోకాపేట భూములతోనే ఆశలు పెట్టుకుని దశల వారీగా ప్లాట్లను విక్రయిస్తున్న సర్కారు.. బుధవారం మరో రెండు ప్లాట్లను అమ్మేసింది. ప్లాట్ నంబర్. 19లోని 4 ఎకరాలకు రూ. 524 కోట్లు, ప్లాట్ నంబర్. 4లోని ఎకరాలకు రూ. 472 కోట్ల చొప్పున రేటు పలికింది. మొ త్తంగా ఈ రెండు ప్లాట్ల ద్వారా రూ. 996 కోట్లను ఆర్జించింది.
ఇక ఇప్పటివరకు రెండు దశల్లో జరిగిన భూముల వేలం ద్వారా ప్లాట్ నంబర్.17లోని 4.59 ఎకరాల భూమికి రూ. 136.50 కోట్లు/ఎకరానికి, ప్లాట్ నంబర్-18లోని 5.31 ఎకరాల్లో రూ.137.25కోట్లు/ఎకరానికి, ప్లాట్ నంబర్.15లో 4.03 ఎకరాల ప్లాట్‌కు రూ. 151.25 కోట్లు, ప్లాట్ నంబర్.16లో 5.03 ఎకరాల ప్లాటుకు రూ. 147.75 కోట్లు/ఎకరానికి, 4 ఎకరాలు ఉన్న ప్లాట్ నంబర్. 19కి రూ. 131కోట్లు/ఎకరానికి, ప్లాట్ నంబర్. 20లో గల 4.04 ఎకరాల ప్లాట్‌కు రూ. 118కోట్లు/ఎకరానికి విక్రయించింది. దీంతో మొత్తంగా కోకాపేట లే అవుట్‌లోని 6 ప్లాట్ల ద్వారా రూ. 3700 కోట్లు ఆర్జించింది.