ఎల్బీనగర్ : పర్యవరణానికి ఇబ్బందులు కలిగించని మట్టి వినాయక విగ్రహాల తయారీనే ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హయత్‌నగర్ ప్రాంతంలో షెడ్లు వేసుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో వినాయక విగ్రహాలు తయారు చేసుకునే కళాకారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ గోడును వినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల మూలంగా చెరువులు కలుషితం అవుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమకు కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో మాత్రమే విగ్రహాలు తయారు చేయడం వస్తుందని, విగ్రహాలు తయారీపై నిషేధం విధిస్తే రోడ్డు పాలు అవుతామంటూ వారు వాపోయారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, హయత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, హరికృష్ణ, నర్సింహారావు, పింకీ, మోడెరం కన్నయ్య, ముఖేష్, సమయ్య తదితరులు పాల్గొన్నారు.