
మహేశ్వరం, డిసెంబర్ 11: వైద్య రం గానికి తెలంగాణ ప్రభుత్వం పెద ్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల హాస్పిటల్ పనులను శనివారం పరిశీలించి వైద్యులతో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నా రు. హైద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నాలుగు సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను రూ.12 వందల కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్‌నగర్, మేడ్చల్‌లలో ప్రభుత్వం ఏ ర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు నియోజకవర్గాలలో ఉన్న హాస్పిటల్స్‌లో వైద్యులను భర్తీ చేస్తామన్నారు. మహేశ్వరం హాస్పిటల్లో నెలకు 28 డెలివరీ కేసులను చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతోనే డెలివరీల సంఖ్య పెరుగుతున్నాయని ఆమె అన్నారు. కేసీఆర్ కిట్స్ అందించి బాలింతలను ప్రభుత్వం వైద్య పరంగా ఆదుకుంటుందని ఆమె అన్నారు. హాస్పిటల్, ఆక్సీజన్ ప్లాంటు పనుల్లో వేగం పెం చాలని ఆమె అధికారులను ఆదేశించారు. కరోన విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు, ఆశా వర్క ర్ల సేవలు మరువలేనివని ఆమె అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కరోన టీకాలను వేయించుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కో ఆర్డినేటర్ ఝాన్సిలక్ష్మి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీతా ఆంధ్యా నాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాద వ్, ఎంపీడీవో నర్సింహులు, తసీల్దార్ ఆర్పీ జ్యోతి, సూపరిండెంట్ గాయత్రి, ఔట్ సోర్సింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీయోద్దిన్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, హనుమగల్ల చంద్రయ్య, సర్పంచ్‌లు రాజు నా యక్, మోతిలాల్ నాయక్, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, అరుణ రమేష్, గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, డాక్లర్లు పాల్గొన్నారు.