సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న డాక్టర్ శంకర్స్ పీపుల్స్ హాస్పిటల్ పై ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు నిర్వహించి నిర్మాణంలో కనీస జాగ్రత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్యాధికారులు విచారణ కమిటీ వేశారు.
ఆసుపత్రిలో ఎలాంటి నిబంధనలు పాటించలేకుండా జీహెచ్ఎంసీ నుంచి స్టిల్ట్ ప్లస్ 4 అంతస్తులు, 11.08 మీటర్ల ఎత్తు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారని, కానీ వాస్తవంగా అది 18.75 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారని..నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు కనీసం అగ్నిమాపక శాఖనుంచి ఎన్ఓసీ కూడా తీసుకోలేదని నివేదికిచ్చారు. దీంతో మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో 2 ఆసుపత్రులను సీజ్ చేసి 15 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ప్రైవేట్ ఆసుపత్రులు గ్రేటర్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను తుంగలో తొక్కుతూ కనీస అవసరాలు కూడా ఆసుపత్రిలో లేకుండానే మెడికల్ దందాకు తెరలేపుతున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వైద్యాధికారులు జరుపుతున్న క్షేత్రస్థాయి తనిఖీల్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. కనీసం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకుండానే వైద్యంతో వ్యాపారం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన ఆసుపత్రులు 2800 ఉండగా అంత కు మించి రిజిస్ట్రేషన్ కానీ క్లినిక్‌లు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ జిల్లాలో గతేడాది నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ఆసుపత్రుల్లో వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించి రూ. 16లక్షల జరిమానా విధించారు. 6 ఆసుపత్రులను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో సైతం 76 క్లినిక్‌లకు జరిమానా విధించగా, 6 ఆసుత్రులు, 4 క్లినిక్‌లను సీజ్ చేశారు. ఈ ఏడాది సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 8 ఆసుపత్రులకు జరిమానా విధించడంతోపాటు, 3 ఆసుపత్రులను సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో కేవలం రెండు నెలల కాలంలోనే 40 ఆసుపత్రులల్లో తనిఖీలు నిర్వహించి 15 ఆసుపత్రులకు షోకాజ్ మిగతా IIవ పేజీలో