బోనాల జాతరను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి పలువురు మంత్రులతోపాటు ప్రముఖులు విచ్చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్,ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు కే.కేశవరావు, జోగినపల్లి సంతోష్‌కుమార్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర షీప్స్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, నగర సీపీ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లతోపాటు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. కాగా నేడు ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలక మండలి తెలిపింది.
సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి: మంత్రి మల్లారెడ్డి
సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న తాగు, సాగునీరును దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే సీఎం కేసీఆర్.. దేశానికి ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఘనంగా బోనాలు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. అన్ని దేవాలయాలకు నిధులు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనేనని చెప్పారు.