TGSRTC | సుల్తాన్ బజార్, జూలై 13 : కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం దర్శనార్ధం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువస్తుందని హైదరాబాద్ డిపో1 మేనేజర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ఎంజీబీఎస్ నుండి సూపర్ లగ్జరీ బస్సు బయల్దేరుతుందని ఆయన వివరించారు. ఈ సర్వీస్ మొదటగా గానుగపూర్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం ముగించుకొని 19న సాయంత్రానికి కొల్హాపూర్ చేరుకుటుందని తెలిపారు. మహాలక్ష్మి శక్తి పీఠం దర్శన అనంతరం పండరీపూర్‌కు చేరుకుంటుందన్నారు . 20వ తేదీన శ్రీ విఠళేశ్వర స్వామి దర్శన అనంతరం సాయంత్రానికి తుల్జాపూర్ చేరుకుంటుంది. భవాని మాత దర్శన అనంతరం 21వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుందన్నారు. కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనానికి వెళ్ళదలచిన ప్రయాణికులు ఈ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ముందస్తు రిజర్వేషన్ ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సమీపంలోని బుకింగ్ ఏజెంట్ దగ్గర కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చుని అన్నారు. ఈ సర్వీస్ నెంబర్ 95595 కాగా, ఒక్కోక్కరికి టికెట్ ధర రూ. 3 వేలుగా నిర్ణయించడం జరిగిందని ఆయన వివరించారు.