క్లౌడ్ కిచెన్లపై చర్యలు
నగరంలో టీజీ సేఫ్ అధికారులు 23 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణంలో, కాలం ముగిసిన పదార్థాలతో చేస్తున్నట్టు గుర్తించారు.
ఖైరతాబాద్, నవంబర్ 10: నగరంలో టీజీ సేఫ్ అధికారులు 23 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణంలో, కాలం ముగిసిన పదార్థాలతో చేస్తున్నట్టు గుర్తించారు. 8 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేశారు. అలాగే గచ్చిబౌలిలోని బిర్యానీ బైకిలో గుర్తించిన అధికారులు.. ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేశారు. మాదాపూర్‌లోని కుల్చాకల్చర్, సోమాజిగూడలోని లక్కీ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, టామ్ యమ్ ఇన్నోవిజన్స్, జోరా 11బై 2, ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్ క్లౌడ్ కిచెన్, సోడెక్సో ఇండియా సర్వీసెస్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు.
అమీర్‌పేటలోని కాకతీయ మెస్, మియాపూర్‌లోని ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్, శేరిలింగంపల్లిలోని రెబల్ ఫుడ్స్ తో పాటు మరో ఏడు సంస్థలకు షోకాజు నోటీసులను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులను అందజేశారు. తనిఖీల్లో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న సుమారు 700 కిలోల ఆహారాన్ని అధికారులు ధ్వంసం చేశారు. ఈ తనిఖీలలో పలు రెస్టారెంట్లలో దెబ్బతిన్న ఫ్లోరింగ్, వంటగదుల్లో పేరుకుపోయిన ఆహార వ్యర్థ్ధాలు, సరిగాలేని వాషింగ్ ఏరియా, పూడుకుపోయిన డ్రైనేజీలు, జిడ్డుపట్టిన ఎగ్జాస్ట్ వ్యవస్థాలు ఉన్నట్టు గుర్తించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

