హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): అమెరికాలో తెలుగు రుచులు అందరినీ ‘ఆహా’ అనిపించాయి. మన అమెరికా తెలుగు అసోసియేషన్ (మాట) ఆధ్వర్యంలో నిర్వహించిన దేశీ చెఫ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఆదివారం యునైటెడ్ స్టేట్స్లోని ఆల్ఫారెట్టా (జార్జియా)లో దేశానా మిడిల్ స్కూల్లో దేశీ చెఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలోని తెలుగు కుటుంబాలకు చెందిన సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలుగు వంటకాలు అందరినీ మెప్పించాయి. ఈ పోటీల్లో రేణుక దర్గం(మొదటి), మాధవి మున్నగి(ద్వితీయ), రమాదేవి, స్వరూప(తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు.
తొమ్మిదేండ్ల చిన్నారి సృష్టికి ప్రత్యేక బహుమతి అందజేశారు. మణి చికలపాటి, అనూష వక్క, టాలీవుడ్ సింగర్ కృష్ణ ప్రసాద్, మాట ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గానగోని న్యాయ నిర్ణేతలుగా, శిరీషా సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మాట ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గూడూరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగితోపాటు సలహా మండలి సభ్యులు జితేందర్ రెడ్డి, ప్రదీప్ సామల, కోశాధికారి గంగాధర్ ఉప్పల, కో ఆర్డినేటర్ విజయభాసర్ కలాల్, సంయుక్త కార్యదర్శి టోనీ జన్ను, వెంకట్ సుంకిరెడ్డి, ఉపాధ్యక్షులు రాజ్ అందదేహి, శ్రీధర్ గూడాల, శ్రీనివాస్ తాటిపాముల, బోర్డు డైరెక్టర్ నగేశ్ చిలకపాటి, వేణు టప్పా, మాధవి మున్నగి, శిరీషా రెడ్డి, శ్రావణి చంద్ర పర్యవేక్షించారు.