బండ్లగూడ, మే 31: తెలంగాణలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి భరోసా ఇవ్వడానికి టెలీ మానస్ పేరిట హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసినట్లు నేషనల్ హెల్త్ మిషన్ అధికారి, ప్రముఖ సైకాలజిస్ట్ పాతనేని వెల్లడించారు. మానసిక సమస్యలపై సలహాలు కావాలనుకున్న వారు, స్వాంతన పొందాలనుకున్న వారు తమ హెల్ప్ లైన్ 14416 నెంబర్ పై ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఆయన సూచించారు. అహం సూత్ర సోషల్ ల్యాబ్, స్పార్క్ కమ్యూనిటీ హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం పెద ్దతాళ్లకుంట పార్కులో మానసిక ఆరోగ్యంపై జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సమాజంలో రోజు రోజుకు మానసిక సమస్యలు పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద ప్రతి రాష్ట్రంలో టెలీ మానస్ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసిందని హెల్ప్ లైన్ సూపర్వైజర్, సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ కనకయ్య, మల్లికార్జున్రెడ్డి, పెద్దతాళ్లకుంట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, దుర్గాదాస్, అహం సూత్ర సోషల్ ల్యాబ్ వ్యవస్ధాపనకులు రాచూరి అజిత్, సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ మధు తదితరులు పాల్గొన్నారు.