మైమరిపించే జలసవ్వళ్లు.. పచ్చనివనం మధ్యలో కొండలు.. ఆహ్లాదాన్ని అందించే సాగరతీరాలు.. ఆకట్టుకునేఅభయారణ్యాలు.. ట్రెక్కింగ్‌కు అనువైన హిల్స్.. నగరవాసులను రా..రమ్మంటున్నాయి. రణగొనశబ్దాలతో హడలెత్తిపోతూ.. ఉద్యోగంలో పరుగులు పెడుతూ.. ప్రతీ రోజూ అలసిన మనసులకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సాంత్వన చేకూర్చనున్నాయి. ఇన్నాళ్లు కరోనా భయంతో ఇంటికే పరిమితమైన కుటుంబాలకు స్వేచ్ఛ ఊపిరిని అందించనున్నాయి. ఒత్తిడికి దూరంగా సహజసిద్ధ ప్రకృతి ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారి కోసం మహానగరానికి చేరువలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి అనుభూతి పంచే వాటిలో కొన్ని పర్యాటక ప్రాంతాలు మీ కోసం…
ట్రెక్కింగ్ కోరుకునే వారికి అనంతగిరి స్వర్గధామం. వికారాబాద్‌కు కేవలం పది, హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి కొండల చుట్టుపక్కల అంతా అటవీ ప్రాంతం.. నిర్మలమైన వాతావరణం ఉంటుంది. సొంతంగా కారు, బైక్ ఉన్నవారికి ఈ టూర్ సౌకర్యవంతంగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 8 గంటల తర్వాత వికారాబాద్ వెళ్లే రైళ్లు ఉంటాయి. ఎంజీబీఎస్ నుంచి బస్సులు కూడాఉంటాయి. వికారాబాద్ నుంచి 5 కిలో మీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉంటుంది. అనంతగిరి హిల్స్‌లో తెలంగాణ టూరిజం వారి హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్ ఉంది. అంతేకాదు ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.
నగరానికి చేరువలో చాలా జలపాతాలున్నాయి. బొగత జలపాతం, నిర్మల్ జిల్లాలో కుంటాల, పొచ్చర జలపాతాలు ఉన్నాయి. ఆ జలసవ్వడిని తిలకించేందుకు..క్రస్టుగేట్ల నుంచి నదిలోకి జారుతున్న నీటిని చూసి ఆనంద పరవశానికి లోనవుతూ సెల్ఫీలు దిగి జలసవ్వళ్ల అందాలను వీక్షించొచ్చు.
ఇక్కడ కృష్ణమ్మ కనువిందు చేస్తుంది. హైదరాబాద్ నుంచి 5 గంటల ప్రయాణం. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. సుందరమైన దృశ్యాలకు నెలవు. అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటి. నది ఒడ్డున ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించొచ్చు. భ్రమరాంబదేవీ, సాక్షి గణపతి ఆలయాలు ఉంటాయి.
హైదరాబాద్ నుంచి 207 కిలోమీటర్ల దూరం. సుమారు 4గంటలు ప్రయాణం. గోదావరి నదిపై కట్టిన ఈ ప్రాజెక్టును చూడటానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు,సిర్నాపల్లి గడీ, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకూర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, అలీసాగర్ తదితర పర్యాటక ప్రాంతాలన్నింటిని వీక్షించొచ్చు.
నల్గొండ జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 108 కిలోమీటర్ల దూరం. సుమారు 2:30గంటలు ప్రయాణం. ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉన్న డిండిలో సుందరమైన దృశ్యాలు అనేకం. ట్రెక్కింగ్, బ్యాక్ వాటర్ ట్రిప్స్తో ఎంజాయ్ చేయొచ్చు. కిందకు జారుతున్న నీటి ప్రవాహం మనసుకు నూతనోత్తేజాన్ని అందించనుంది. శ్రీశైలానికి వెళ్లేదారిలో డిండీని చూడటానికి పర్యాటకులు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తారు.
హైదరాబాద్ నుంచి 15 కిలో మీటర్ల దూరం. ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రదేశం. ఎత్తైన ప్రదేశాలను వీక్షించాలనుకునే వారికి ఇష్టమైన ప్రాంతం.2017 అడుగుల ఎత్తు ఉన్న ఈ మౌలాలీ దర్గా నుంచి నగర అందాలను వీక్షించడం కొత్త అనుభూతినిస్తుంది. కనులు మిరుమిట్లు గొలిపే సూర్యోదయ, సూర్యాస్తమయ సుందర దృశ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా దీనికి ఖ్యాతి.
నూతనోత్తేజాన్ని నింపే అత్యుత్తమ క్యాంపింగ్ ప్రదేశంగా దీన్ని చెప్పవచ్చు. హైదరాబాద్‌కు 50 కిలో మీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ క్యాంపింగ్ చేసేందుకు అధిక శాతం పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు.
హైదరాబాద్ నుంచి 220కిలో మీటర్ల దూరం. నగర పర్యాటకులను ఆకర్శించే ముఖ్యమైన వాటిల్లో లక్నవరం ఒకటి. ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరునాగారం అభయారణ్యం సందర్శకులను కనువిందు చేస్తున్నది. లేక్క్రాసింగ్, రోప్ కోర్సులు, కయాకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీనికి సమీపంలో బొగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతం.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్‌పేట్ సికింద్రాబాద్‌కు 20కిలో మీటర్ల దూరంలో ఉంది. నిజాం చేత నిర్మించబడిన మానవ నిర్మిత చెరువు. ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జింకల పార్క్‌లో జింకలతో పాటు నెమళ్లు, పలు రకాల పక్షులు దర్శనమిస్తాయి. ఈ చెరువు వద్ద షూటింగ్స్ జరుగుతాయి. రకరకాల శిలలతో అలరించిన ఈ చెరువు అందంగా కనిపిస్తుటుంది.