హైదరాబాద్, ఆట ప్రతినిధి, మార్చి 12: జాతీయ అంతర్జాతీయ క్రీడకారులుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జే.రాజశేఖర్ రెడ్డి బుధవారం రవీంద్రభారతిలో ఒక వినతిపత్రం అందజేశారు.
ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన తెలంగాణ కోచ్‌లకు సంబంధించిన 67 పోస్టుల్లో కేవలం నలుగురే ఉన్నారని, ఖాళీగా ఉన్న 63 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న 136 కోచ్‌లను నియమిస్తూ మరో 330 మంది కోచ్‌ల నియామకం కోసం ఫైనాన్స్ అప్రూవల్ నోటిఫికేషన్లకు సిద్ధం చేసిన అప్పటీ క్రీడా ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానా సిద్ధం చేసిన ఫైల్ని కాదని ప్రస్తుతం కేవలం 38 మంది కోచ్‌ల ఇతర సిబ్బంది 136 తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉన్నత అధికారులు ప్రభుత్వానికి పంపించడం పట్ల కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఒలింపిక్‌లో పథకాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు పోతున్న ఈ తరుణంలో ప్రస్తుత పర్మినెంట్ కోచ్‌లు నలుగురు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో 25 ఏండ్లకు పైగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోచ్‌లు.. ప్రస్తుతం ఏ-గ్రేడ్‌లో 28 మంది కోచ్‌లు డీఎస్ఓ పోస్టుల, అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ డైరెక్టర్లుగా పదవులను నిర్వహిస్తున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో 63 మంది కోచ్‌ల ఖాళీలు ఉన్నా ఒక్కరిని కూడా నియమించకపోవడం గమనార్హం. స్పోర్ట్స్ అథారిటీలో 136 మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కోచ్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కాబట్టి 74 మిగతా కోచ్‌లను జీవో నంబర్ 5 ద్వారా నియమించాలని కోరారు.