తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను శనివారం హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను పలువురు వివరించారు. అసెంబబ్లీ, శాసన మండలి కార్యాలయాలు, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ జెండాను ఎగురువేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల్, అసెంబ్లీ సెక్రటరీ వీ. నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డీ.ఎస్.లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమయ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో సూర్యలత, ఆధికారులు, తహసీల్దారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధలో టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు జీ.నర్సింగ్‌రావు, టీ.జగత్‌రెడ్డి, జే. సూర్యప్రకాశ్, బీ నర్సింగ్‌రావు, ఎం.సచ్చిదానందం, సీహెచ్.వెంకటరాజం, ఎస్.అశోక్‌కుమార్, బీ లక్ష్మయ్య, ఏ.అంజయ్య, డాక్టర్ టీఆర్కే రావు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని (ఓఆర్ఆర్)ప్రాజెక్ట్ డైరెక్టర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్ ఎగురవేశారు.కార్యక్రమంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి, ఎస్టేట్ అధికారి గంగాధర్, ప్లానింగ్ డైరెక్టర్ శివ శరణప్ప, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రమణ గౌడ్, ఉద్యోగులు పాల్గొన్నారు.అదేవిధంగా నానక్‌రాంగూడలోని ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వద్ద ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ సీజీఎం రవీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను సీఎండీ జి.రఘుమారెడ్డి ఎగరవేశారు.ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా శనివారం రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరిగౌరీ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ పాల్గొన్నారు.
బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేస్తున్న మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి, ఉన్నతాధికారులు.
రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి డైరెక్టర్ బలరాం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు సురేంద్ర పాండే, కే సూర్యనారాయణ, లక్ష్మణ్‌రావు, ఎన్వీ రాజశేఖర్‌రావు, ఎన్ భాస్కర్ పాల్గొన్నారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషన్ జ్యుడిషీయరి సభ్యులు ఆనంద్‌రావు, నాన్ జ్యుడిషీయరీ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్, కార్యదర్శి రిటైర్డ్ డీఆర్ గార్డ్, ఏఆర్ షాబుద్దీన్, పీఆర్వో శ్రీనివాస్‌రావు, ఏవో వెంకటేశ్వర్రావు, డీఎస్పీ సత్తయ్య, సీఐ నర్సింహ, పీసీలు,హెచ్జీతో పాటు ఎన్జీవో న్యాయవాదులు,ఫిర్యాదుదారులు,సిబ్బంది పాల్గొన్నారు.