పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
కేసీఆర్ హయాంలో తెలంగాణ సమగ్ర ప్రగతి ప్రస్థానం.. 10 జిల్లాల నుంచి 33 జిల్లాల విస్తరణతో సమర్థవంతమైన పాలన.. హైదరాబాద్ చుట్టుపకల జిల్లాల్లో పెట్టుబడుల వెల్లువ.. పెరిగిన ప్రజల తలసరి ఆదాయం..కోట్ల ఉద్యోగాల కల్పన
సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ) స్వరాష్ట్రంగా 2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనా సంసరణలకు శ్రీకారం చుట్టారు. పాలనను ప్రజల ముంగిటకి తీసుకెళ్లడంతోపాటు, ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు 2016లో పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం కేవలం వికేంద్రీకరణకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. టీఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మక పారిశ్రామిక విధానం, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతి తావులేని అనుమతుల విధానంతో 2014 నుంచి 2024 మధ్య కాలంలో తెలంగాణ పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ఆవిర్భవించడంలో ఈ పాలనా వికేంద్రీకరణే ప్రధాన చోదక శక్తిగా నిలిచింది.
పరిపాలనాను వికేంద్రీకరించి, మౌలిక వసతులను కల్పించిన సౌలభ్యం, చేకూరిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల సంఖ్య 33కి పెరగడం వల్ల జిల్లా స్థాయి యంత్రాంగం ప్రజలకు, వ్యాపారవేత్తలకు అత్యంత సమీప అందుబాటులోకి వచ్చింది. కొత్త కలెక్టరేట్లు, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించడంతో ప్రతి జిల్లాలో పాలన వేగవంతమైంది. ఇదే వేగవంతమైన ప్రభుత్వ విధానాలను వేదికగా నిలిచింది. పారిశ్రామికవేత్తలు చిన్నపాటి పనుల కోసం రాష్ట్ర రాజధానికి రానవసరం లేకుండా, జిల్లా స్థాయిలోనే క్లియరెన్సులు పొందే వెసులుబాటు లభించింది.
భూసేకరణ, మౌలిక వసతులతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరగడంతో ఇండస్ట్రియల్ పారులు, ఫార్మా క్లస్టర్లు, ఐటీ పారులకు భూసేకరణ వేగంగా పూర్తయింది. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిలో పారిశ్రామికంగా కేవలం హైదరాబాద్ నగర పరిధిలోనే ఆగిపోకుండా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ తదితర పరిసర జిల్లాలకు శరవేగంగా విస్తరించింది. రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, వికారాబాద్ పారిశ్రామిక ల్యాండ్ సేప్ (2014-2024) హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, వికారాబాద్ జిల్లాలు కేసీఆర్ పాలనలో పారిశ్రామిక ప్రగతికి చోదక శక్తులుగా మారాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో సాధించిన పారిశ్రామిక మైలురాళ్లు, పెట్టుబడుల గణాంకాలు ఊహకందనీ స్థాయిలో చేరుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా: ఐటీ, ఏరోస్పేస్, గ్లోబల్ డేటా సెంటర్ల రాజధానిరంగారెడ్డి జిల్లా కేసీఆర్ హయాంలో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. శంషాబాద్, కొంగరకలాన్, నాదేర్గుల్, మహేశ్వరం ప్రాంతాలు గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలుగా మారాయి.
మేడ్చల్-మలాజిగిరి జిల్లా: మేడ్చల్ జిల్లా ఎంఎస్ఎంఈ రంగానికి, ఫార్మా తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. జీడిమెట్ల, బొల్లారం, చర్లపల్లి, శామీర్ పేట్ లలో విస్తరించి ఉన్న పరిశ్రమలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. జీనోమ్ వ్యాలీ విస్తరణతో అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇకడ కొలువుదీరాయి. వందలాది ఇంజినీరింగ్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ యూనిట్లు ఏర్పడ్డాయి.
వికారాబాద్ జిల్లా: అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ రంగాలు పట్టణ పారిశ్రామిక వృద్ధిని గ్రామీణ రంగానికి అనుసంధానించడంలో వికారాబాద్ జిల్లా ప్రత్యేకత సాధించింది. తాండూరు సిమెంట్ పరిశ్రమలతో పాటు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు విధానంతో వికారాబాద్‌లో అగ్రో ఆధారిత పరిశ్రమలు భారీగా పెరిగాయి. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించింది.
అంతర్జాతీయ గుర్తింపు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన పాలసీలు, టీఎస్-ఐపాస్ చట్టం అంతర్జాతీయంగా నిపుణుల ప్రశంసలు పొందాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లలోనూ, దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక, వేదికగానూ హైదరాబాద్ పేరు మార్మోగింది. అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ మెరుగు పరిచే ఓఆర్ఆర్, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా వల్ల బహుళ జాతీయ సంస్థలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశాయి. మొత్తంగా, కేసీఆర్ పాలనాలో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ..తెలంగాణ రూపురేఖలను మార్చిన సాంఘిక, ఆర్థిక విప్లవంగా చరిత్రలో నిలిచిపోయింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

