దివ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని నినాదాలతో హోరెత్తించారు. గురువారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేశ్, ఉపాధ్యక్షుడు బి.స్వామి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
-చిక్కడపల్లి, అక్టోబర్ 8
చిక్కడపల్లి, అక్టోబర్ 8 : వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అత్యంత వెనబడిన దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర కల్పిస్తున్న ముఖ్యమంత్రి కొత్తగా వృద్ధులకు కూడా కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో దివ్యాంగులకు ఎందుకు ఉచిత ప్రయాణం కల్పింరని ప్రశ్నించారు. 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం ఆర్టీసీ బస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో షాప్స్ ఏర్పాటు చేసుకునేందుకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 10,48,822 మంది దివ్యాంగులు ఉన్నారని, వీరిలో సగం మంది మహిళలు ఉన్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేశ్, ఉపాధ్యక్షుడు బి.స్వామి, ఉపేందర్, నాయకులు జె.రాజు, గంగాధర్, బాలిశ్వర్, శశికల, భూజంగారెడ్డి, ప్రకాష్ తదితరలు పాల్గొన్నారు.