Shamshabad Airport | ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెయ్యి మంది ప్రయాణికుల నిరీక్షణ
Shamshabad Airport | ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Shamshabad Airport | ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు
తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానాన్ని దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఏమైందని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నించినప్పటికీ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఎంతసేపటికీ విమానం కదలకుండా అలాగే రన్‌వేపై ఆపడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో చేసేదేమీ లేక వారిని తిరిగి ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి నుంచి వారు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. బెంగళూరుతో పాటు ముంబై, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాల్లోనూ అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు వెయ్యి మంది వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే తమ జర్నీ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్సయ్యామని ఆవేదన చెందారు. వీసా ఇంటర్వ్యూల కోసం, ఇతరత్రా పనుల మీద వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఇండిగో తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

