సమస్యల సారథి
ఆర్టీఏ సేవలు మరింత పారదర్శకంగా అందించడం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన సారథి, వాహన్ పోర్టల్ సేవలు సాంకేతిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిస్థాయి సేవలు అందించడానికి రెండు వారాల సమయం పట్టనున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని రోజులుగా ఆర్టీఏ సర్వర్ మొరాయిస్తుండటంతో పలు రకాల ట్రాన్సక్షన్స్, స్లాట్స్కు అంతరాయం ఏర్పడింది.
- ఆర్టీఏ సేవలకు సాంకేతిక ఇబ్బందులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ ): ఆర్టీఏ సేవలు మరింత పారదర్శకంగా అందించడం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన సారథి, వాహన్ పోర్టల్ సేవలు సాంకేతిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిస్థాయి సేవలు అందించడానికి రెండు వారాల సమయం పట్టనున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని రోజులుగా ఆర్టీఏ సర్వర్ మొరాయిస్తుండటంతో పలు రకాల ట్రాన్సక్షన్స్, స్లాట్స్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఓటీపీలు రావడం లేదు. మరికొన్ని సేవల్లో ట్రాన్సక్షన్స్ విఫలమవుతున్నాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని వాహనదారులు చెబుతున్నారు. టీఆర్ గడువు ముగిసినా రిజిస్ట్రేషన్ నంబర్లు రాకపోవడంతో వాహనాలు బయటకు తీయాలంటే వాహనదారులు భయపడాల్సి వస్తున్నది. మరోవైపు మీ సేవ సెంటర్లు కూడా సాంకేతిక ఇబ్బందులతో సేవలు అందించడం లేదు. ఇదిలా ఉంటే ట్రాన్సక్షన్స్ ఫెయిల్ అయినా డబ్బులు డ్రా అవుతున్నాయి. అలాంటి కేసుల్లో రీఫండ్ కోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

