సైదాబాద్, ఆగస్టు 1: ఆడ పిల్ల పుట్టిందని కట్టుకున్న భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బంగారు ఆభరణాలను తీసుకుని వస్తేనే ఇంట్లో ఉండాలంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆరు నెలల ఇద్దరు పసికందులతో ఇంట్లో నుంచి గెంటివేసి గేటుకు తాళాలు వేశాడు. తనకు న్యా యం చేయాలంటూ ఆమె తన చంటి పిల్లలతో ఇంటి ముందే ఆందోళన చేపట్టి పోలీసులను ఆశ్రయించిన ఘట న సోమవారం సాయంత్రం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు, పోలీసు ల కథనం ప్రకారం..సైదాబాద్ లోకాయుక్త కాలనీలోని పుష్ప అపార్టుమెంట్ ఎదురుగా నివసించే గోరెంక శ్రీకాంత్తో స్వప్నకు 2014 మార్చి 5న వివాహమైంది.
ఒప్పం దం ప్రకారం, అమ్మాయి ఇంటి వారు కట్న కానుకలతో ఘనంగా వివాహం చేశారు. శ్రీకాంత్ బెంగళూర్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, స్వప్న గృహిణి. ఉద్యోగ రీత్యా బెంగుళూర్లో ఉంటున్న వారికి ఆరేండ్ల క్రి తం కూతురు వైష్టవి జన్మించింది. అమ్మాయి పుట్టడంతో శ్రీకాంత్ భార్యను వేధింపులకు గురిచేసి పుట్టింటికి పంపా డు. అప్పటి నుంచి దంపతుల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటిలోనే ఉంటుంది. కొం త కాలం క్రితం పెద్ద మనుషులు వారి మధ్య రాజీ చేశా రు. మళ్లీ దంపతులకు ఆరు నెలల క్రితం స్వప్నకు కవల పిల్లలు పుట్టగా, అందులో ఒకరు అడపిల్ల, ఒక మగ పిల్లా డు పుట్టాడు. మళ్లీ ఆడ పిల్లకు జన్మనిచ్చిందనే నెపంతో స్వప్నను అత్తవారింట్లో వేధింపులకు గురి చేస్తున్నారు. అదే విధంగా పుట్టింటి నుంచి బంగారు ఆభరణాలను తీసుకుని రావాలంటూ వారం రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులంతా కలిసి స్వప్నను బయటకు పంపించి గేటుకు తాళం వేశారు.