హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పుప్పాలగూడలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పుప్పాలగూడలో హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన 130 గ్రాముల మత్తుమందును సీజ్ చేశారు. నిందితుడి నుంచి రెండో మొబైల్ ఫోన్లు, రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు