సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : స్వామి వివేకానంద మార్గం నేటి యువతకు అనుసరణీయమని పలువురు వక్తలు అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంకల్పం, చిత్తశుద్ధి అంటే స్వామి వివేకానంద గుర్తుకు వస్తారని, ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని దేశానికి వివేకానందుడు చేసిన సేవలను కొనియాడారు.
కోఠిలోని ఇసామియాబజార్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్త, బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాట్లాడుతున్న బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తదితరులు