బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.1లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్లు పూజ, ఆహారికతోపాటు పలువురు మోడల్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. దేశంలోని ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన వస్ర్తాలు, ఆభరణాలు, లైఫ్‌ైస్టెల్ ఉత్పత్తులు సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌కు సంబంధించిన బ్రోచర్లను మోడల్స్ ఆవిష్కరించారు.
– బంజారాహిల్స్, ఏప్రిల్ 20