Kalvakuntla Sanjay | MNJ క్యాన్సర్ ఆసుపత్రికి సప్లయర్లు సప్లై ఆపేశారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. MNJ క్యాన్సర్ ఆసుపత్రి తెలంగాణలోనే అతి పెద్ద గవర్నమెంట్ క్యాన్సర్ ఆసుపత్రి కేసీఆర్ హయాంలో MNJ ఆసుపత్రికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు.
కేసీఆర్ ఒక బ్రహ్మాండమైన ఏ కార్పొరేట్ ఆస్పత్రినైనా తలదన్నే విధంగా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి పెడితే ఇవాళ పరిస్థితిచూడండి. క్యాన్సర్ పేషంట్లకు సప్లైలు ఆగిపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే ఒకసారి ఈ రాష్ట్రం ఆలోచన విధానం, ఈ రాష్ట్రం బుద్ది.. ఇవాళ ఉన్న ప్రభుత్వ నాయకుల బుద్ధి ప్రజలు అర్థం చేసుకోవాలి.. వీళ్లు ఇప్పటివరకు ఏ పని కూడా మానవీయ కోణంతో చేయరు.
ఉన్నవాళ్లను చంపుతున్నరు.. ఉన్నవాళ్ల ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంటే ఫ్యూచర్ సిటీ (భవిష్యత్ సిటీ)కి రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఒక్క మనిషి లేని చోట్ల కొత్తకొత్త ఎనిమిది లైన్ల రోడ్లు వేశారు. మా విద్యార్థులు విద్యకు నోచుకోకుండా ఉన్నారు.. మా పేషంట్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.. దీని మీద ఎంత అవుతది ఖర్చు. మీరు రోజూ హెలికాప్టర్లో తిరుగుతున్న ఖర్చు కంటే తక్కువ ఖర్చు మా అన్ని ఆస్పత్రులకు, మా మెడికల్ కాలేజీలకు సరిపోతది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీరు హెలికాప్టర్ తిరిగితే అయ్యే అంత ఖర్చు కూడా కాదు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి.. మీ ప్రాధాన్యతలేంటి అసలు అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు.
MNJ క్యాన్సర్ ఆసుపత్రికి సప్లయర్లు సప్లై ఆపేశారు
MNJ క్యాన్సర్ ఆసుపత్రి తెలంగాణలోనే అతి పెద్ద గవర్నమెంట్ క్యాన్సర్ ఆసుపత్రి
కేసీఆర్ గారు MNJ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు
అలాంటి ఆసుపత్రి పరిస్థితి చూడండి.. మీరు హెలికాప్టర్ తిరిగితే అయ్యే అంత ఖర్చు కూడా కాదు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి
– ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో