మనస్తాపాపంతో యువకుడి ఆత్మహత్య
యువకుడు ఆత్మహత్య | ‘మనశ్శాంతికోసం వెతుకుతున్నా..చావొక్కటే దానికి మార్గమంటూ..’ ఓ యువకుడు వాట్సప్ స్టేటస్‌లో వీడియో పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బంజారాహిల్స్,సెప్టెంబర్ 7: ‘మనశ్శాంతికోసం వెతుకుతున్నా..చావొక్కటే దానికి మార్గమంటూ..’ ఓ యువకుడు వాట్సప్ స్టేటస్‌లో వీడియో పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హకీంపేటలోని ఫాతిమా కాలనీలో నివాసం ఉంటున్న ఇక్బాల్ ఉస్మానీ(28) బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
తండ్రి పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో తల్లి మహబూబ్ ఆథర్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో పాటు తల్లి అనారోగ్యంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాంతో మనస్థాపానికి గురైన ఇక్బాల్ ఉస్మానీ సోమవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గంట తర్వాత గమనించిన తల్లి మహబూబ్ అథర్ స్థానికుల సాయంతో దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. మృతుడి మొబైల్ఫోన్లో స్టేటస్‌ను పరిశీలించగా తాను మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నానని, చావొక్కటే మనశ్శాంతి ఇస్తుందంటూ వీడియో సందేశం పెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

