Gurukula Schools | సర్కార్ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు దినదిన గండం!
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు భయపడిపోతుంటే..అక్కడ చదివించడానికి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రెండు గురుకుల పాఠశాలల్లో 5 రోజులలోనే 2 ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.
- గురుకులం.. భయం భయం!
- వరుస ఘటనలతో బెంబేలెత్తిపోతున్న విద్యార్థులు
- సంక్షేమ పాఠశాలల్లో చదివించాలంటే
- భయం వేస్తున్నదంటున్న తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోతున్న వైనం
Gurukula Schools | మేడ్చల్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు భయపడిపోతుంటే..అక్కడ చదివించడానికి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రెండు గురుకుల పాఠశాలల్లో 5 రోజులలోనే 2 ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.
కీసరలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపర్చిన సంఘటన మరవక ముందే నాగారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 33 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థత గురై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డిశ్చార్జి అయ్యారు.
అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ ఘటనలకు కారణమని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా నాగారం పాఠశాలను శుక్రవారం సందర్శించి విచారించారు. పిల్లలు తినే భోజనం ఎలా అస్వస్థత పాలు చేసిందనే విషయంపై కారణాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ ప్రారంభించారు.
ఇంటికి వెళ్లిపోతున్న విద్యార్థులు
నాగారంలోని సాంఘిక సంక్షేమ మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఘటన జరుగుతూ ఉంటే.. గురుకులాల్లో చదివించాలంటేనే తమకు భయం వేస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

