ఎల్బీనగర్, నవంబర్ 13: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్ న్యూ మారుతీనగర్‌కు చెందిన లోకేశ్ కూతురు త్రిష (20) నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నది.
బుధవారం ఉదయం ఆమె కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి.. కర్మన్‌ఘాట్ మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డును దాటుతుండగా అతివేగంగా వచ్చిన బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో కిందపడిపోయింది. ఆ వెంటనే వచ్చిన కారు కూడా ఆమెను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయింది. ఈ ప్రమాదంలో త్రిష తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు