దుండిగల్, అక్టోబర్14: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో ఆదివారం రాత్రి తండ్రీ కొడుకుపై వీధి కుక్కలు దాడి చేశాయి. పనిమీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుండగా, వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.