హైదరాబాద్: డ్రగ్స్‌కు (Drugs) హైదరాబాద్ అడ్డగా మారుతున్నది. నిన్న హుమాయునగర్లో ఎండీఎంఏను విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు.. ఇవాళ ఆన్లైన్లో డ్రగ్స్ అమ్ముతున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు. హాజీపూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. మత్తు, స్టెరాయిడ్ (Steroids) ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఏడుగురిని టీన్యాబ్ పోలీసులు పట్టుకున్నారు. హాజీపూర్‌లోని సుశీలదేవి హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ కెమిస్ట్‌తో కలిసి ఇంజెక్షన్లు తరయారు చేస్తున్నారని, సర్వసతి ఎంటర్ప్రైజెస్, ఫార్మా డిస్ట్రిబ్యూటర్ పేరుతో సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని ఆన్లైన్, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయిస్తున్నారని తెలిపారు.
పంజాగుట్టకు చెందిన నయీముద్దీన్.. పాట్నాలోని విజయ్‌కుమార్ గుప్తా ద్వారా డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88 లక్షల డ్రగ్ ఇంజెక్షన్లు సరఫరా చేశారన్నారు. హైదరాబాద్‌లోనే వెయ్యి వరకు అమ్మారన్నారు. ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్ గుప్తా, నయీముద్దీన్తోపాటు ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన మహేశ్, లవణ్‌కుమార్, సురేశ్, మనీశ్లను అరెస్టు చేశామన్నారు.